ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దాం….
1 min read– పౌష్టికాహార మాసోత్సవాల్లో ఐసిడిఎస్ పీడీ కే. ప్రవీణ
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ కే.ప్రవీణ. జిల్లా కేంద్రంలో ఐసిడిఎస్ కర్నూలు అర్బన్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌష్టికాహార మాసోత్సవాలను బుధవారం ప్రారంభించారు. అనంతరం కర్నూలు నగరంలోని పలు వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పిడి ప్రవీణ మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, యుక్త వయస్సు బాలికలు పోషకాహారం తీసుకోవాలన్నారు. పోషకాహార మాసోత్సవాల్లో భాగంగా ఒక్కోవారం ఒక అంశంపై అంగన్వాడీ లబ్దిదారులకు, ప్రజలకు అవగాహన కల్పించి, వారిని కూడా భాగస్వాములను చేస్తామన్నారు. పరిశుభ్రత, ఆరోగ్యం, పౌష్టికాహారం తదితర అంశాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ప్రజల సంక్షేమార్థం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఐసీడీఎస్ పీడీ కె. ప్రవీణ కోరారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ కర్నూలు అర్బన్ ప్రాజెక్టు సిడిపిఓ ఎన్. వరలక్ష్మీదేవమ్మ, సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, వార్డు సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.