వ్యాధి ని తొలి దశ లో గుర్తిద్దాం…
1 min read
ఆరోగ్య నియమాలు పాటిద్దాం….
జెమ్ కేర్ కామినేని ‘ లో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం..
కర్నూలు, న్యూస్ నేడు : జిల్లా న్యాయ సేవాధికారిక సంస్థ, జిమ్ కేర్ కామినేని హాస్పిటల్, లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ల సంయుక్త ఆధ్వర్యంలో జెమ్ కేర్ కామినేని వైద్యశాలలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని తొలి దశలో వ్యాధిని గుర్తించడం- ఆరోగ్య నియమాలు పాటించడం- దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాల పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా న్యాయ సవాధికారి సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి బి .లీల వెంకట శేషాద్రి ఆదేశాల మేరకు లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు .ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికారిక సంస్థ కార్యదర్శి బి .లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ ఏది సాధించాలన్న ఆరోగ్యంగా జీవించడం చాలా ముఖ్యమైనది అన్నారు. అనంతరం జెమ్ కేర్ కామినేని వైద్యులు సీ.ఈఓ డాక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలన్నారు .లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యాధులను తొలి దశలో గుర్తించగలిగితే చికిత్స సులభతరం అవ్వడమే కాకుండా పూర్తిగా నయం చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. అనంతరం వైద్యులు వ్యాధుల లక్షణాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ సభ్యులు పవన్, గోపీనాథ్, మురళి శంకరప్ప, రామకృష్ణ, ఎల్ల గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
