మట్టి వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్టిద్దాం- పర్యావరణాన్ని కాపాడుకుందం
1 min read–Dr. శంకర్ శర్మ
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: మట్టి వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్టిద్దాం- పర్యావరణాన్ని కాపాడుకుందం అని డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ శంకర్ శర్మ ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, డివైఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శిరీష జిల్లా కార్యదర్శి నగేష్, జిల్లా సహాయ కార్యదర్శి హుస్సేన్ భాష, అబ్దుల్లా, నాయకులు వినయ్ వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ పర్యావరణానికి హానికరమైన ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ వాడకుండా అందరం మట్టి వినాయకుని విగ్రహాలను ప్రతిష్టిద్దాం పర్యావరణాన్ని కపడుకుందామని పిలుపునిచ్చారు. ఈరోజు వాతావరణం కలుషితం కావడం వల్ల భూమి వేడెక్కి వరదలు భారీగా కురవడం లేదంటే వరదలే లేకుండా పోవడం అతివృష్టి అనావృష్టి ఏర్పడడం మరియు కొత్త కొత్త వైరస్ పుట్టుకొస్తున్నాయి వీటివల్ల మనుషుల జీవనానికే ప్రమాదకరంగా మారుతుందని తెలిపారు. ప్రజలందరూ అడవులను నరకడం, ప్లాస్టిక్ వాడడం, వాతావరణాన్ని కలుషితం చేయడం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలని భారీగా ఉపయోగించడం ద్వారా పర్యావరణం కలుషితమైపోతుందని తెలిపారు. కావున ప్రజలందరము సంతోషంగా ఆహ్లాదకరంగా మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకొని వినాయక చవితిని జరుపుకోవాలని కోరారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వాడకంతో అవి మట్టిలో కలిసిపోకుండా ఉండడం ద్వారా పర్యావరణం పాడవుతుంది. పర్యావరణాన్ని కాపాడుకోలేని పరిస్థితి రావటం వల్ల ఈరోజు కొత్త కొత్త వైరస్ లు పుట్టుకు రావడం, భూమిపై 50 డిగ్రీల ఉష్ణోగ్రత పెరగడం దాని ఫలితంగా భారీ వర్షాలు వర్షాలే లేకుండా పోవడం జరిగి జీవరాశులన్నింటికీ ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడుకోవడంలో భాగంగా మట్టి వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్టించాలని పిలుపునిచ్చారు.