జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిద్దాం…
1 min read
జిల్లా ఇన్చార్జి ఆఫీసర్, రహదారులు, భవనాలు, రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే
కర్నూలు, న్యూస్ నేడు : జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిద్దామని జిల్లా ఇన్చార్జి ఆఫీసర్, రహదారులు, భవనాలు, రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే పేర్కొన్నారు.సమర్థవంతమైన పరిపాలనను అందించేందుకు వీలుగా రాష్ర్ట ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారులను డిస్ట్రిక్ట్ ఇన్చార్జ్ ఆఫీసర్లుగా, స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయి ఐఏఎస్ అధికారులను జోనల్ ఇన్చార్జ్ ఆఫీసర్లుగా నియమించింది. ఇందులో భాగంగా కర్నూలు జిల్లా ఇన్చార్జి అధికారి గా నియమితులైన రహదారులు, భవనాలు, రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే శనివారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలో చేపడుతున్న ఫ్లాగ్ షిప్ కార్యక్రమాల అమలుపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా వ్యవసాయం, డ్వామా,డి ఆర్ డి ఏ జలవనరులు, వైద్యారోగ్యం, విద్యా శాఖలకు సంబంధించిన కార్యక్రమాల అమలు గురించి ఆయా శాఖల జిల్లా అధికారులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి అధికారి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు ముఖ్యమంత్రి డిస్ట్రిక్ట్ ఇన్చార్జ్ ఆఫీసర్లు, జోనల్ ఇన్చార్జ్ ఆఫీసర్లుగా నియమించారన్నారు..జిల్లాను ప్రగతి పథంలో నడిపించడానికి వీలుగా జిల్లా కలెక్టర్ కు తగిన సహకారం, మార్గదర్శకత్వం అందించేందుకు ప్రభుత్వం ఈ వ్యవస్థ ను ఏర్పాటు చేసిందన్నారు.. నిన్ననే జిల్లా అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలు, వనరుల సమీకరణ అంశాలపై జిల్లా కలెక్టర్ తో చర్చించడం జరిగిందని ఆయన తెలిపారు..జిల్లాలో పేదరిక నిర్మూలన, ఎంఎస్ఎంఈ ల ఏర్పాటు, విద్య, వైద్య రంగాల అభివృద్ధి, నీటి వనరుల వినియోగం తదితర అంశాలపై దృష్టి సారిస్తామని తెలిపారు.. ఆ దిశగా అధికారులు పని చేయాలని జిల్లా ఇన్చార్జి అధికారి ఆదేశించారు.జిల్లా కలెక్టర్ కు అభినందన : విద్యా శాఖకు సంబంధించి వర్చువల్ తరగతుల నిర్వహణ ద్వారా ఉత్తమ ఉపాధ్యాయులతో 500 పాఠశాలల విద్యార్థులకు విద్యా బోధన అందిస్తూ, పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ను అధిగమించడం పై జిల్లా కలెక్టర్ తీసుకున్న ప్రత్యేక చొరవ ను ప్రిన్సిపల్ సెక్రటరీ అభినందించారు..టెక్నాలజీ అమలులో జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ముందుంటారని,గతంలో కడప లో పని చేసే సమయంలో భూ రికార్డుల కంప్యూటరీకరణ లో వారి పాత్ర ప్రశంసనీయమని ప్రిన్సిపల్ సెక్రటరీ పేర్కొన్నారు.జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా మాట్లాడుతూ జిల్లాలో అమలు చేస్తున్న కార్యక్రమాల పురోగతి, జిల్లా అభివృద్ధి పై జిల్లా ఇన్చార్జి అధికారి ప్రతి 15 రోజులకు ఒకసారి లోతుగా సమీక్షిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు..అందువల్ల అన్ని శాఖల అధికారులు, ఆయా శాఖల కార్యక్రమాల అమలులో పురోగతి చూపించాలని కలెక్టర్ ఆదేశించారు..జిల్లాలో అమలవుతున్న కార్యక్రమాల గురించి కలెక్టర్ ప్రిన్సిపల్ సెక్రటరీ కి వివరించారు.సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా.బి. నవ్య అసిస్టెంట్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ వెంకటనారాయణమ్మ, సిపిఓ హిమ ప్రభాకర్ రాజు, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.