కార్మికుల, కర్షకుల హక్కుల కోసం మే డే స్ఫూర్తితో ఉద్యమిద్దాం
1 min read
కార్పొరేట్, మత రాజకీయాలనుసరిస్తున్న ప్రభుత్వాలను వ్యతిరేకిద్దాం….సిపిఎం
పత్తికొండ, న్యూస్ నేడు: మే డే స్ఫూర్తితో నేడు దేశంలో పాలకులు అమలు చేస్తున్న కార్పొరేట్ మత రాజకయలకు వ్యతిరేకంగా కార్మిక వర్గ హక్కుల కోసం ఐక్య పోరాటాలకు మేడే స్పుర్తిగా సిద్ధమవుదామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.డి. ఆనందబాబు, గౌస్ దేశాయ్, గోపాల్ రంగారెడ్డి బి వీరశేఖర్, సిద్దయ్య గౌడ్, సురేంద్ర లు పిలుపునిచ్చారు.అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా గురువారం దేవనకొండ పత్తికొండ మండలాల్లో ఉత్సాహపూరితమైన వాతావరణంలో సిఐటియు అనుబంధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులు మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. హమాలీ వర్కర్స్ యూనియన్,అంగన్వాడీ వర్కర్స్ యూనియన్,భవన నిర్మాణ కార్మికులు, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ,ఐకెపి యానిమేటర్స్ యూనియన్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా పత్తికొండ, దేవనకొండ, తేర్నేకల్ గ్రామాలలో వివిధ ప్రదేశాలలో ఏర్పాటుచేసిన అరుణ పతాకాలను అనేక చోట్ల ఆవిష్కరించారు. సిఐటియు మండల కార్యదర్శి అశోక్, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి మహబూబ్ బాషా అధ్యక్షతనజరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ, నాడు కార్మిక వర్గం పోరాడి ప్రాణ త్యాగం చేసి 8 గంటల పని దినాలు సాధించుకుంటే, నేడు పాలకులు చట్టాలు మార్చుతూ, పని గంటల పెంపుకు నాంది పలుకుతున్నారని, మేడే స్ఫూర్తితో హక్కుల సాధన ఐక్య పోరాటాలకు సిద్ధమవుదామని వారు పిలుపునిచ్చారు.బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక కార్మికుల దర్శకుల ప్రజల హక్కులను హరించివేస్తూ, రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుందన్నారు.
