PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మే డే స్ఫూర్తితో ఉద్యమిస్తాం ..సి ఐ టి యు

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: గడివేముల మండలం సీఐటీయూ మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నాడు బస్టాండ్ ఆవరణలో మరియు ఆటో స్టాండ్ వద్ద మేడే కార్యక్రమం నిర్వహించారు.ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సభ్యురాలు చెన్నమ్మ అధ్యక్షతన మే డే ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకురాలు జి నాగమణి అంగన్వాడి వర్కర్స్ యూనియన్ మండల నాయకురాలు వసుధమ్మ ఎల్ల సుబ్బయ్య మాట్లాడుతూ 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా మార్పు చేసే పద్ధతి సరైంది కాదన్నారు ఎందరో మహనీయులు కార్మిక చట్టాల కోసం వాళ్ల ప్రాణాల సైతం లెక్క చేయకుండా ప్రాణాలర్పించి కార్మిక చట్టాలను తీసుకొచ్చిన ఘనత కార్మిక వర్గానికి చెందినది ఎందరో మహనీయులు పోరాటాల్లో రక్త మడుగుల్లో తడిచి ముద్దయినటువంటి వారి యొక్క దుస్తులను ఎర్రజెండగా ఎగరవేయడం జరిగిందని అప్పటినుంచి ఇప్పటిదాకా కార్మికులు కర్షకులు మే డే సందర్భంగా ఎర్రజెండ్ ఎగరవేసి వాటి యొక్క ప్రాముఖ్యతను చాటుకుంటున్నారన్నారు.దేశ సంపదను అదాని.అంబానీలకు అప్పగిస్తూ కార్మిక వ్యతిరేక చట్టాలు తెస్తున్న మోడీ ప్రభుత్వ విధానాలపై ఐక్య ఉద్యమాలు చేస్తామని మతతత్వ నిరంకుశ విధానాలపై పోరాడుతామని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్ ఆఫ్ డూయింగ్ పేరుతో కార్మికుల శ్రమ శక్తిని దోచుకుంటున్న విధానాలపై కార్మికులు కర్షకులు ఐక్యమై పోరాడాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు స్వచ్ఛభారత్ ఆటో యూనియన్ నాయకులు గోకర్ సా మైకల్ చంద్ర హమాలి నాయకులు చిన్నన్న రాజు ఆశ వర్కర్స్ మేరమ్మ శ్యామల వీఆర్ఏ నాయకులు దైవ నాయుడు శీను కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author