మోడీ విష పూరిత విధానాలను తిప్పికొడదాం
1 min read– రాజ్యాంగ హక్కులను కాపాడుకుందాం:సిపిఎం జిల్లా కమిటి సభ్యులు
యం డి ఆనంద్ బాబు
పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ విషపూరిత విధానాలను తిప్పికొట్టి రాజ్యాంగ హక్కులను కాపాడుకోవాలని సిపిఎం జిల్లా కమిటి సభ్యులు యం డి ఆనంద్ బాబు పిలుపు నిచ్చారు.సోమవారం గోనెగండ్ల మండల కేంద్రం లో సిపిఎం, సీపీఐ కమిటి ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రచార బేరి కార్యక్రమాన్ని యం డి ఆనంద్ బాబు ప్రారంభించారు. ప్రచార భేరి సభలు బస్టాండ్ సెంటర్ లో మొదలై, వైయస్ఆర్ సర్కిల్, గంజాహళ్లి రోడ్, చింతల మునిస్వామి గుడి, పెద్ద కట్ట, సంతబజార్, బీరప్ప గుడి, ఎస్సీ కాలని, స్టేట్ బ్యాంక్ సెంటర్ లలో నిర్వహించారు.కెవిపియస్ జిల్లా ఉపాధ్యక్షులు బి కరుణాకర్ అధ్యక్షతన జరిగిన సభలను ఉద్దేశించి సిపిఎం జిల్లా కమిటి సభ్యులు యం డి ఆనంద్ బాబు, సిపిఎం మండల నాయకులు దండు ఖాజ, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు మునిస్వామి, ఈరన్న లు మాట్లాడారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెల్లవాళ్ళను తరిమికొట్టి దేశానికి స్వాతంత్రాన్ని సాధించుకోవడంతోపాటు, రాజ్యాంగం ద్వారా ప్రజలందరికీ హక్కులను సాధించుకోవడం జరిగిందన్నారు. కానీ నేడు మోడీ, అమిత్ షాల నాయకత్వంలో కేంద్రం లో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం, ప్రజలకు దక్కాల్సిన రాజ్యాంగపు హక్కులన్నీ ద్వంసం చేస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని ఒక్కొక్కటిగా అమ్మేస్తోందన్నారు. ఎంతో భక్తి శ్రద్దలతో ప్రజలు గుడిలో పెట్టుకున్న దేవుళ్లను బజారున పెట్టి, ప్రజల మధ్య మత చిచ్చులు రేపుతూ.. మరో వైపు దేశం లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ లన్నింటినీ తన అనుయాయులైన అదాని, అంబానీలకు కట్టబెడుతోందన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ పాలిస్తున్న బిజెపి ని సాగనంపేదాకా ప్రజలను మరింత ఐక్యం చేసి పోరాడాలని వారు పిలుపు నిచ్చారు. ప్రచార బేరి కార్యక్రమానికి న్యాయవాదులు చంద్రశేఖర్, వెంకటేష్ లు మద్దత్తు ఇచ్చారు. కార్యక్రమం లో డేవిడ్ రాజు,ఐరన్ బండ దేవదాస్, గోనెగండ్ల మారేషు, నరసింహుడు, పెద్ద నేలటూరు పెద్ద దస్తగిరి, ఏనుగ బాల ఆనంద్, పిల్లిగుండ్ల పెద్ద భీమన్న, ఎస్ఎఫ్ఐ కాజా తదితరులు పాల్గొన్నారు.