ప్రజల వినతుల పరిస్కారమే జగనన్నకు చెబుదాం లక్ష్యం..
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: సంతృప్తి స్థాయిలో వినతుల పరిష్కారమే లక్ష్యంగా ప్రజలకు నిర్ణీత గడువులోగా నాణ్యమైన ప్రభుత్వ సేవలందించే ఉద్దేశంతో ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం శ్రీకారం చుట్టారని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ అన్నారు. మంగళవారం నందికొట్కూరు ఎంపీడీఓ కార్యాలయంలో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్థర్ మాట్లాడుతూ సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభించారన్నారు. ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా 1902 టోల్ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశారన్నారు.“అర్హత ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు రాని పరిస్థితులు ఉంటే వెటనే 1902 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయొచ్చు. పరిపాలనలో వివక్ష, లంచాలకు చోటులేని వ్యవస్థను తీసుకువచ్చేలా విప్లవాత్మక అడుగులు వేస్తూ వస్తున్నామన్నారు. అందులో భాగంగా స్పందన కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకొంచిందన్నారు. స్పందన ద్వారా గ్రామ సచివాలయం నుంచి కలెక్టర్ల వరకు స్పందించి సమస్యలు తీర్చేలా ఇప్పటికే ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు . స్పందనకు ఇంకా మెరుగులు దిద్దుతూ జగనన్నకు చెబుతాం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంచిందన్నారు. ప్రజలకు సేవలు మరింత మెరుగ్గా అందుబాటులోకి రావాలన్నదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ మురళీకృష్ణారెడ్డి , మున్సిపల్ కౌన్సిలర్లు ఉండవల్లి ధర్మారెడ్డి , మొల్ల. జాకీర్ హుస్సేన్ , మండల తహసిల్దార్ రాజశేఖర్ బాబు, మండల అభివృద్ధి అధికారి శోభారాణి , పశుసంవర్ధక శాఖ జే.డి. వర ప్రసాద్ , జిల్లా ఎస్సి విభాగం అధ్యక్షులు సగినేల.వెంకటరమణ , జిల్లా ఎస్సి ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు సంటిగారీ. దిలీప్ రాజ్ , నందికొట్కూరు వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ సగినేల.ఉసేనయ్య , పాములపాడు వైస్ ఎంపీపీ బండ్లమూరి వెంకటేశ్వర్లు , యం.ఇ.ఓ ఫైజున్నేసా , గ్రామ సర్పంచ్ లు బాల మద్దిలేటి , మౌలాలి , వైసిపి నాయకులు తమడపల్లి విక్టర్, భాస్కర్ రెడ్డి, ముడియాల.వెంకట రమణ రెడ్డి, బాలీశ్వర్ రెడ్డి, రత్నం, గ్రంధి పీరయ్య, ఇనాయతుల్లా, శంకరయ్య, కదిరి. సుబ్బన్న, మద్దిలేటి, బాషా, ముజీబ్, వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.