‘లయన్స్ క్లబ్స్’ సేవలు ప్రశంసనీయం
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: లయన్స్ రీజియన్ సమావేశంలో భాగంగా ఐ.ఎం.ఏ సమావేశ మందిరం నందు జరిగిన కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ క్లబ్ ద్వారా సేవలందించిన లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ ను మాజీ గవర్నర్లు డాక్టర్ బాల మద్దయ్య, లయన్ దుర్గ నాగేశ్వరరావు , లయన్ డాక్టర్ రవికృష్ణ ,లయన్ నాగేశ్వరరావు యాదవ్, డాక్టర్ రాహుల్ , లయన్ రామరాజు, లయన్ పద్మశాలి వెంకటేశ్వర్లు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు, నంద్యాల ,డోన్ ,ఆదోని తదితర లయన్స్ క్లబ్ ల అధ్యక్ష కార్యదర్శులు లయన్స్ మెంబర్లు కేవీ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

