PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లండన్ ఎగ్జిబిషన్ ప్రారంభం..

1 min read

హేలాపురి నగరవాసులు అవకాశాన్ని సద్విని చేసుకోవాలి..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  :  26వ డివిజన్ శనివారం పేట పాత తివాసి సెంటర్ ప్రాంతంలో లండన్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు. నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగ సందర్భంగా అందరికీ ఆహ్లాదాన్ని ఇచ్చే లండన్ పట్టణ ప్రాంతాలలో ఉండే అన్ని సోయగాలు ఈ ఎగ్జిబిషన్లో తిలకించవచ్చని నిర్వాహకులు తెలిపారు. పిల్లలకు పెద్దలకు అందరికీ కావలసిన ఐటమ్స్ మరియు రకరకాల వినోధాన్ని అందించేవి జెయింట్ వీల్, డ్రాన్నింగ్ ట్రైన్, కొలంబస్, ఉంటాయన్నారు. అన్ని వెరైటీల తినిబండారాలు ఈ ఎగ్జిబిషన్లో ఉంటాయని లండన్ సుందర వీధులు మనం అక్కడికి వెళ్లి చూడలేకపోయినా సినిమాల్లో, వివిధ మాధ్యమాల్లోనే తిలకిస్తామని. ఈ ఎగ్జిబిషన్లో రకరకాల లండన్ స్ట్రీట్స్ ని ఏర్పాటు చేశామని, రకరకాల వెలుగులు వెదజల్లే లైటింగ్స్ తో అందర్నీ ఆకట్టుకుంటాయన్నారు.‌ అందరూ తిలకించి ఆనందిస్తారని హేలాపురి పట్టణ ప్రాంత వాసులు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు తెలిపారు. అన్నారు.

About Author