షర్మిలమ్మ కర్నూలు జిల్లా పర్యటనను విజయవంతం చేయండి
1 min read
సిటీ ప్రెసిడెంట్ షేక్ జిలాని భాష
కర్నూలు, న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల రెడ్డి కర్నూలు జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని కర్నూల్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ జిలాని భాష తెలియజేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగిన సమీక్ష సమావేశంలో జిలాని భాష మాట్లాడుతూఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశలో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో షర్మిలమ్మ పర్యటనలలో భాగంగా కర్నూలు జిల్లాలో ఈనెల 11వ తేదీన సాయంత్రం మూడు గంటలకు షర్మిలమ్మ కార్యకర్తల సమావేశమునకు విచ్చేయుచున్నారని కనుక ఈ సమావేశమునకు కాంగ్రెస్ నాయకులు, నియోజక వర్గాల కోఆర్డినేటర్లు, జిల్లా కాంగ్రెస్ అనుబంధ సంస్థల నాయకులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, నగర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమమును విజయవంతం చేయవలెనని జిలాని భాష తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు , కోడుమూరు కోఆర్డినేటర్ అనంతరత్నం మాదిగ, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు బి బతుకన్న, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎన్సి బజారన్న, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు షేక్ ఖాజా హుస్సేన్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మహేంద్ర నాయుడు, జిల్లా మహిళా కాంగ్రెస్ ఎస్ ప్రమీల, కాంగ్రెస్ నాయకులు ఎండ్లురి లాజరస్, షేక్ రియాజుద్దీన్, సయ్యద్ ఖాద్రీ పాష, అబ్దుల్ హై, ఐఎన్టియుసి ఆర్ ప్రతాప్ మొదలగు వారు పాల్గొన్నారు.