NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మండలానికి వరించిన పదవులు..

1 min read

– టిటిడి బోర్డు మెంబర్, జిల్లా వైఎస్ఆర్సిపి  ఉపాధ్యక్షులు

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : వైయస్సార్ సిపి సీనియర్ నాయకులు, రాచు పల్లె వెంకటసుబ్బారెడ్డి( మా సీమ బాబు)ను వైఎస్ఆర్సిపి అధిష్టానం టిటిడి బోర్డు మెంబర్ గా ప్రకటించింది, వైయస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి గా ఉన్న మాసి మ బాబు, చెన్నూరు మండలంలోనే కాకుండా, జిల్లా వ్యాప్తంగా అటు రాజకీయ ప్రముఖులతోనే కాకుండా, జిల్లా ప్రజలకు కూడా ఆయన సుపరిచితుడే, అలాగే వైఎస్ఆర్సిపి జిల్లా అధికార ప్రతినిధిగా ఉన్న గుమ్మా రాజేంద్ర ప్రసాద్ రెడ్డికి, జిల్లా ఉపాధ్యక్షులు ఇవ్వడంతో, చెన్నూరు మండలంలో వైయస్ఆర్సీపీ నాయకులలో, మండల ప్రజలలో హర్షత్రికలు వెల్లువెత్తాయి, రాత్రి నుండి ఉప్పరపల్లె, నరసారెడ్డి పల్లెలో వైఎస్ఆర్సిపి కార్యకర్తలు, అభిమానులు బాణా సంచ పేలుస్తూ, ఒకరికి ఒకరు మిఠాయిలు తినిపించుకోవడమే కాకుండా పెద్ద కేకు కట్ చేసి ప్రజలకు పంచిపెట్టారు, గుమ్మ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి కి విధేయులుగా ఉంటూనే మండలంలో తనదైన ముద్ర వేయడం జరిగింది, నిత్యం ప్రజలకు, వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు, అభిమానులకు, అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ, అనేక ప్రజా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది, అటు గుమ్మా రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, ఇటు రాచు పల్లె వెంకట సుబ్బారెడ్డి( మాసిమ బాబు) వైయస్ఆర్సీపీ ఆవిర్భావం నుండి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వెన్నంటూ ఉంటూ, రాజకీయాలలో తనదైన ముద్ర వేయడం జరిగింది, అంతే కాకుండా వీరి ఇరువురు పార్టీ విజయం కొరకు తమ వంతు కృషి చేయడం జరిగింది, రాజకీయాలలో గురువర్యులుగా, పేరుగాంచిన మాసి మ బాబుకు టీటీడీ బోర్డు మెంబర్గా ప్రకటించడంతో , వైఎస్ఆర్సిపి శ్రేణులు, ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు, అలాగే చెన్నూరు మండలంలోని ముండ్లపల్లె గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు ముండ్ల నవనీశ్వర్ రెడ్డికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి టీటీడీ బోర్డు మెంబర్ గా అవకాశం కల్పిస్తే, నేడు ఆయన తనయులు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, రామనపల్లి గ్రామానికి చెందిన రాచు పల్లె వెంకటసుబ్బారెడ్డి( మా సిమ బాబు) కు అవకాశం కల్పించడం జరిగింది, దీంతో మండలంలో పెద్ద ఎత్తున ఆయన అభిమానులు సంబరాలు చేసుకోవడం జరిగింది.

About Author