ఆలయాలలో శ్రావణమాస శోభ
1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : మండలంలోని ఆలయాల్లో శ్రావణ రెండో శనివారం సందర్భంగా శ్రావణ శోభ సంతరించుకున్న, స్థానిక ప్రసన్న వెంకటేశ్వర స్వామి( కోట్ల స్వామి) దేవస్థానంలో, అలాగే సరస్వతి నగర్ లోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి, రామాలయం వీధిలో వెలసిన శ్రీ సీతారామ సంకీర్తన క్షేత్రం ఆలయాలలో శనివారం తెల్లవారుజాము నుండి స్వామి వారికి ప్రభాత సేవ, అభిషేకాలు, అర్చనలతో పాటు ప్రత్యేక అలంకరణలు గావించారు, ఆలయాలకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనగా , ఆలయ కమిటీ వారు భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం తో పాటు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు, శ్రీ సీతారామ సంకీర్తన క్షేత్రంలో, రామనపల్లెలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

