PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

2023 లో మాక్స్ అబాకస్ రాయచోటి విద్యార్థుల విజయభేరి

1 min read

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: eCMAS చెన్నై వారు ప్రతి ఏడు నిర్వహించే అంతర్జాతీయ స్థాయి అబాకస్ అండ్ మెంటల్ అర్థమెటిక్ పోటీలు ఫిబ్రవరి 12వ తేదీన చెన్నైలో జరిగిన కాంపిటీషన్లో రాయచోటి తరఫున మాక్స్ అబాకస్ నుండి 18 మంది విద్యార్థులు పాల్గొనగా 18 మంది కి ట్రోఫీలు వచ్చాయని మ్యాక్స్ అబాకస్ రాయచోటి బ్రాంచ్ నిర్వాహకురాలు శ్రీమతి శాంతిలక్ష్మి తెలిపారు.ఈ సందర్భంగా మార్చ్ 9 వ తారీఖున కాంపిటీషన్లో గెలుపొందిన విద్యార్థులకు ట్రోఫీల ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాయచోటి అర్బన్ సీఐ శ్రీ సుధాకర్ రెడ్డి గారు, డైట్ ఇంచార్జ్ ప్రిన్సిపల్ ఎం. శివ భాస్కర్ గారు, మరియు రాయచోటి పట్టణ ప్రముఖ డాక్టర్ ఎంఎస్ జనరల్ సర్జన్ డాక్టర్ శ్రీ ఎస్. రెడ్డి మహేశ్వర రాజు గారు, మరియు ప్రముఖ గైనకాలజిస్ట్ శ్రీమతి యస్. ఉషారాణి గారి చేతులు మీదుగా పోటీలో గెలుపొందిన విద్యార్థులకు ట్రోఫీల ప్రధానోత్సవం జరరిగింది. ఈ సందర్భంగా రాయచోటి మాక్స్ అబాకస్ బ్రాంచ్ నిర్వాహకురాలు శ్రీమతి శాంతి లక్ష్మి గారు మాట్లాడుతూ అబాకస్ ద్వారా గణితం నందు వేగం మరియు ఖచ్చితత్వం పొందవచ్చని, అబాకస్ ద్వారా పిల్లలలో కలిగే గణిత నైపుణ్యాలు మరియూ ప్రయోజనాలను చక్కగా తెలియచేశారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనీ హర్షం వ్యక్తం చేశారన్నారు. అబాకస్ పోటీల్లో ఎస్.నిఖిత్ వర్మ, ఏ.వెంకటేశ్వరరాజు, ఎస్. నూర్ భాషా, ఎస్. అయాన్, సి.ఫణి రామ్ వర్మ, బి. ప్రణయ శ్రీ, బి జోష్నా, పురంధర రాయుడు, పి. గంగ మురళి సిరి ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్లుగా, కే. అద్నాన్ ఫరీజ్, యస్. సాత్విక్ ప్రసాద్ రాజు, సి. ఫణిశ్రీ, పి. సద్ధాఫ్, డి. అఫాన్ ఖాన్, పి. మహమ్మద్ ఆతీఫ్, పి. మేఘ శ్రీ ఛాంపియన్స్ గా, ఈ. వేద వర్షిణి, ఎం.అభిజ్ఞ విన్నర్ వన్ గా నిలిచారని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.

About Author