ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి…
1 min read
జిల్లాలోధరల నియంత్రణ కొరకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలలి
జిల్లా జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : జిల్లాలో ధరల నియంత్రణ కొరకు కార్యచరణ ప్రణాళిక రూపొందించుకోవాలి. సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం స్ధానిక కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో జెసి పి. ధాత్రిరెడ్డి అధ్యక్షతన ధరల నియంత్రణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ నిత్యవసర వస్తువులు, కూరగాయల ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. హోల్ సేల్ , రిటైల్ రంగంలో ధరలను విశ్లేషించాల్సిన అవసరం ఉందన్నారు. వినియోగదారులకు కూరగారయలు, నిత్యవసరాల ధరలు అందుబాటులో ఉండేలా పర్యవేక్షించాలని అధికారులకు స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా పౌర సరపరాల శాఖ అధికారి వై. ప్రతాప్ రెడ్డి, జిల్లా ఉద్యనవాన శాఖ అధికారి ఎస్. రామ్మోహన్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి హబీబ్ భాషా, జిల్లా వ్యవసాయ వాణిజ్య, మార్కెటింగ్ అధికారి వి. మహేంద్రనాద్, జిల్లా డిప్యూటీ కంట్రోలర్ (లీగల్ మెట్రాలజీ) అధికారి బి.వి. హరిప్రసాద్, ఎపిఎంఐపి ప్రాజెక్టు డైరెక్టర్ రవికుమార్, జిల్లా లోని రైతు బజారులోని ఎస్టేట్ అధికారులు, రైతులు, వ్యాపారస్తులు పాల్గొన్నారు.