తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు…
1 min read
హొన్నూరు కొట్టాలలో బోరును పరిశీలిస్తున్న ఆర్ డబ్ల్యూఎస్ ఏఈ రాష్ట్రీల
ముద్దటమాగిలో నీటి సమస్య గురించి గ్రామస్తులతో మాట్లాడుతున్న ఏఈ
హొళగుంద న్యూస్ నేడు: వేసవి కారణంగా గ్రామాలలో తాగునీటి ఎద్దడి లేకుండ చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్ డబ్ల్యూఎస్ ఏఈ రాష్ట్రీల తెలిపారు. శుక్రవారం ఆయన హొన్నూరు, హొన్నూరు కొట్టాల, నాగరకణ్వీ, ముద్దటమాగి గ్రామాలలో తిరిగి నీటి సమస్య తలెత్తకుండ చర్యలు చేపట్టారు. ముద్దటమాగిలోని కొత్త కాలనికి పైజైన్ పనులు, మిని ట్యాంక్ నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన కొద్ది రోజులో కాలనివాసులకు పూన్తిగ తాగునీరునందిస్తామన్నారు. అలాగే మిగిలిన గ్రామాలలో బోర్ల పనితీరు, పైడ్లైన్ సమస్య ఇతర వాటిని పరిశీలించారు. గ్రామాలలో నీటి సమస్యలు రాకుండ తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన విలేకరులకు తెలిపారు.