NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వ్యాక్సిన్ పై వైద్య విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవాలి

1 min read

న్యూస్ నేడు చెన్నూరు : వైద్య విద్యార్థులు వ్యాక్సినేషన్ పైఅవగాహనపెంపొందించుకోవాలని ముఖ్యంగా బాలింతలు, గర్భవతులు, చిన్నపిల్లల విషయంలో తగు జాగ్రత్తలు పాటిస్తూ మెలుకువతో వ్యాక్సిన్ అందించాలని రూరల్ హెల్త్ ట్రైనింగ్ మెడికల్ అధికారి డాక్టర్ జె సాయి చందన, డాక్టర్ కె విజయ్ కుమార్ లు తెలిపారు. బుధవారం వారు చెన్నూరు కొత్త గాంధీనగర్ లోని ఆరోగ్య ఉప కేంద్రంలో, బాలింతలను, గర్భవతులను పరీక్షించడం తో పాటు  చిన్నపిల్లలకు వ్యాక్సిన్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా కడప రిమ్స్ నందు చదువుతున్న వైద్య విద్యార్థులు ట్రైనింగ్( హౌస్ సర్జన్) అవగాహన, శిక్షణ లో భాగంగా చెన్నూరు సామాజిక ఆరోగ్య కేంద్రం నుండి సచివాలయం-3 పరిధిలోని చెన్నూరు కొత్త గాంధీ నగర్ లోని ఆరోగ్య ఉపకేంద్రంకు రావడం జరిగింది. కాగా వైద్య విద్యార్థులకు వైద్యులు ఏ ఏ జబ్బులకు ఏ ఏ వ్యాక్సినేషన్ ఉపయోగిస్తారు, వ్యాక్సిన్ అయినప్పటి నుండి, ఉపయోగించే వరకు, వ్యాక్సిన్ యొక్క అవసరం, దాని యొక్క ఉపయోగం వాడే విధానం దానిని ఏ విధంగా ఏ యే వాతావరణంలో భద్రపరచాలి వంటి విషయాలపై వైద్య విద్యార్థులకు క్షుణ్ణంగా వివరించడం జరిగింది. అదేవిధంగా గర్భవతులు, బాలింతలు, చిన్నపిల్లలకు ఏ విధంగా వ్యాక్సిన్ అందించాలో ఏఏ మోతాదులో అందించాలో ఆరోగ్య ఉప కేంద్రంలో వారికి అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది వెంకటమ్మ, లక్ష్మీదేవి, రెడ్డమ్మ, సూపర్వైజర్లు షణ్ముగం, మోహన్ రెడ్డి, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అయ్యవారమ్మ, శాంతి, రజిని తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *