PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చింతలపూడిలో ఈ నెల 30న మెగా జాబ్ ఫెయిర్..

1 min read

– 2000 ఉద్యోగఅవకాశలకు ఇంటర్వ్యూలు..

– గోడ పత్రిక ను విడుదల చేసిన జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరు జిల్లా చింతలపూడిలో మే, 30వ తేదీన మెగా జాబ్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు జిల్లాకలెక్టర్ వె. ప్రసన్నవెంకటేష్ చెప్పారు. స్ధానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో సోమవారం మెగా జాబ్ ఫెయిర్ గోడపత్రికను కలెక్టర్ ప్రసన్నవెంకటేష్ ఆవిష్కరించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీడాప్ మరియు జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్త అధ్వర్యంలో చింతలపూడి, గురుబట్లగూడెం రోడ్ లోని బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలఈ నెల 30వ తేదీ  మంగళ వారం న మెగా జాబ్ ఫెయర్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ జాబ్ ఫెయిర్ నందు సుమారు 18 కంపెనీల ప్రతి నిధులు నేరుగా పాల్గొని ఎంపిక చేస్తారని అలాగే సుమారు 2000 ఉద్యోగ అవకాశలు కొరకు ఇంటర్వ్యూ లు నిర్వహించటం జరుగుతుందన్నారు.  ఈ మెగా జాబ్ ఫెయిర్ నందు మత్తుట్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్, అమర్ రాజా ఇండస్ట్రీస్, అపెక్స్ సొల్యూషన్స్, మోహన్ స్పింటెక్స్ లిమిటెడ్ వంటి ప్రముఖ కంపెనీలా నందు కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్ , గోల్డ్ లోన్ ఎగ్జిక్యూటివ్స్, మెషిన్ ఆపరెటర్స్, ఎలక్ట్రీషియన్స్, ఫిట్టర్స్, డెస్క్ జాబ్స్, స్టోర్ ఎగ్జిక్యూటివ్స్ వంటి ఉద్యోగాల నందు పదవ తరగతి, ఇంటర్, ఐ.టి.ఐ, పాలిటెక్నిక్, డిగ్రీ , ఇంజినీరింగ్, పి.జి వంటి విద్యార్హతలు ఉండి 18-35 సంవత్సరాల వయసు గల వారు అర్హులన్నారు.  డి. ఆర్. డి. ఏ పధకం సంచాలకులు విజయరాజు మాట్లాడుతూబ ఈ జాబ్ మేళాకు సంబంధించి ఇతర వివరాలకు 9652503799, 9666322032, 9000803414 ను  (9988853335 – టోల్ ఫ్రీ) ను లేదా rb.gy/dv0v9 లింక్ నందు రిజిస్టర్ కావాలన్నారు.  ఈ జాబ్ మేళాకు హాజరు అయ్యే అభ్యర్ధులు తమ బయడేటా మరియు  సర్టిఫికెట్స్ నకలతో హాజరు కావాలన్నారు.  జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఈ.తమ్మాజి రావు  తెలియజేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి,డిఆర్ఓ ఎవిఎన్ఎస్ మూర్తి, జెడ్పి సిఇఓ కె. రవికుమార్,  డి .ఆర్.డి.ఏ పధక సంచాలకులు ఆర్. విజయరాజు, జిల్లా ఉపాధి అధికారి మధుసూదనరావు, స్కిల్ డెవలప్మెంట్ డి.ఎస్.డి.ఓ ఈ తమ్మాజీ రావు, డ్వామా పిడి పి. రాము తదితరులు పాల్గొన్నారు.

About Author