NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మెగా జాబ్ మేళాకు నిరుద్యోగ యువత నుండి విశేష స్పందన

1 min read

ఆలూరున్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గ నిరుద్యోగ యువత భవిష్యత్తు కోసం మనం వేసిన అడుగు అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చింది!ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ వైకుంఠం జ్యోతి  ప్రత్యేక కృషితో, APSSDC సహకారంతో నిర్వహించిన ఈ మెగా జాబ్ మేళాకు నిరుద్యోగ యువత నుండి విశేష స్పందన లభించింది. వందలాది మంది అభ్యర్థుల హాజరు: నియోజకవర్గం నలుమూలల నుండి ఉత్సాహంగా తరలివచ్చిన యువత.ప్రముఖ కంపెనీల భాగస్వామ్యం: మల్టీనేషనల్ కంపెనీల ప్రతినిధులు పాల్గొని అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశారు.ఉద్యోగ ఎంపిక: అర్హత కలిగిన ఎంతోమంది యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు లభించాయి.”మన యువత కళ్ళలో ఆనందం, వారి చేతిలో ఉద్యోగ పత్రం చూడటమే మాకు అసలైన విజయం!”ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున జయప్రదం చేసిన యువతకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు మరియు సహకరించినAPSSDC అధికారులకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పేరుపేరునా ధన్యవాదాలు.

About Author