క్యాండీక్రష్ ను సొంతం చేసుకున్న మైక్రోసాఫ్ట్
1 min readపల్లెవెలుగువెబ్ : దిగ్గజ ఐటీ సంస్థ మైక్రో సాఫ్ట్ గేమింగ్ వ్యాపార విస్తరణలో కీలక నిర్ణయం తీసుకుంది. క్యాండీక్రష్, కాల్ ఆఫ్ డ్యూటీ వంటి ప్రపంచవ్యాప్త ప్రాచుర్యం పొందిన వీడియోగేమ్స్‌ను అభివృద్ధి చేసిన యాక్టివిజన్ బ్లిజార్డ్ అనే అమెరికన్ కంపెనీని సుమారు రూ.5.15 లక్షల కోట్లకు కొనుగోలు చేయనున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. పూర్తిగా నగదు రూపంలో జరగనున్న ఈ ఒప్పందంలో భాగంగా యాక్టివిజన్ బ్లిజార్డ్‌కు చెందిన ఒక్కో షేరుకు 95 డాలర్లు చెల్లించనుంది. ఈ కొనుగోలుతో మైక్రోసాఫ్ట్ ప్రపంచంలో మూడో అతిపెద్ద గేమింగ్ కంపెనీగా అవతరించనుంది.