పాక్ ఉగ్రవాద స్టావారాలపై సైనిక విజయం అద్భుతం
1 min read
ఎస్ వి మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మరియు వైస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు
కర్నూలు, న్యూస్ నేడు: పెహల్గం లో అమాయకులను పొట్ట న పెట్టుకున్న పాకిస్తాన్ ఉగ్రవాదుల ఫై సైనిక చర్య ద్వారా ఉగ్రవాదులను హత మార్చిన భారత సైనికుల సేవలు అమోఘమని ఎంతో ధైర్య సాహసాలతో పాకిస్తాన్లోని ఉగ్రవాదుల ఆట కట్టించిన సైనికులు అభినందనీయులని మాజీ ఎమ్మెల్యే మరియు వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు .స్థానిక ఎస్ వి కాంప్లెక్స్ దగ్గర గల వైఎస్ రాజశేఖర్ విగ్రహం వద్ద సైనికుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర ను భారతీయ మహిళ సాహసోపేతంగా దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారని భారతీయులంతా ఒక్కటేనని మేరా భారత్ మహాన్ అనే నినాదాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని అన్నారు. ఇకనైనా పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకుని ఉగ్ర వాదుల కు ఆశ్రయం ఇవ్వరాదు అని అన్నారు కార్యక్రమం లో 33 వార్డ్ లకు వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు మహిళా కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.