ఢిల్లీలో ‘అప్నాపన్’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకేష్
1 min read
న్యూఢిల్లీ , న్యూస్ నేడు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తనకు ఉన్న అనుబంధంపై కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రచించిన “అప్నాపన్: మై ఎక్స్ పీరియెన్సెస్ విత్ నరేంద్ర మోదీ” పుస్తకావిష్కరణ కార్యక్రమంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ ఉదయం ఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఆవరణలో ‘అప్నాపన్’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో మాజీ ప్రధాని హెచ్ డీ దేవగౌడ, మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ‘అప్నాపన్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, బీజేపీ నాయకులు, పలువురు సాహితీ ప్రముఖులు పాల్గొన్నారు.

