ప్రమాణ స్వీకార ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి
1 min read

బనగానపల్లె, న్యూస్ నేడు: బనగానపల్లె మార్కెటింగ్ యార్డు కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకార ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిఈ నెల 11 న బనగానపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డ్ పాలకమండలి చైర్మన్ గా కాట్రెడ్డి మల్లికార్జున్ రెడ్డి, సభ్యులు బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో.. ప్రమాణ స్వీకారం ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించిన రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీ సీ జనార్థన్ రెడ్డి.ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చే ప్రజలు, రైతులు, పార్టీ నేతలు, కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు, అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని.. అధికారులకు పలు సూచనలు, సలహాలు చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.

