NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్లెక్సీ లలో కనిపించని ఎమ్మెల్యే ఫోటో…

1 min read

పల్లెవెలుగు  వెబ్ నందికొట్కూరు:  రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ  ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఇండోర్ స్టేడియం ప్రారంభోత్సవం సందర్భంగా  వెలసిన  ఫ్లెక్సీలో  ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్‌ ఫొటో ఎక్కడా కనిపించలేదు.శనివారం రాష్ట్ర పర్యాటక, యువజన క్రీడల శాఖ  మంత్రి రోజా నందికొట్కూరు, పగిడ్యాలలో  రూ 2.38 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇండోర్‌ స్టేడియాలను ప్రారంభించేందుకు వచ్చిన నేపథ్యంలో నందికొట్కూర్‌, పగిడ్యాలలో భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే ఏ ఒక్క ఫ్లెక్సీలోనూ ఎమ్మెల్యే ఆర్థర్‌ ఫొటో లేకపోవడం నందికొట్కూరు పట్టణం, పగిడ్యాల మండలంలో చర్చనీయాంశంగా మారింది.వైసీపీలోని  మరో వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు సైతం ఏర్పాటు చేసిన ప్లెక్సీ లోను ఎమ్మెల్యే ఫోటో కనిపించకపోవడంతో వైసీపీలో వర్గ విబేధాలు మరోసారి బట్టబయలైందని చర్చించుకుంటున్నారు.  జిల్లా శాప్ అధికారులు సైతం ప్లెక్సీ లు ఏర్పాటు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.ఆహ్వాన పత్రికలలో అలాగే శిలాఫలకంలో ప్రోటోకాల్ పాటించలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఈ విషయం పై అధికారులు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.

About Author