ఎమ్మెల్యే చరితమ్మకు.. శుభాకాంక్షల వెల్లువ
1 min read

-కిక్కిరిసి పోయిన ఎమ్మెల్యే స్వగృహం
-ఓర్వకల్లులో ఘనంగా జన్మదిన వేడుకలు..
ఓర్వకల్లు (మిడుతూరు) న్యూస్ నేడు : పాణ్యం శాసనసభ్యులు గౌరు చరితా రెడ్డి జన్మదిన వేడుకలతో ఎమ్మెల్యే స్వగృహం కిక్కిరిసిపోయింది.సోమవారం ఎమ్మెల్యే పుట్టినరోజు కావడంతో కర్నూలు మద్దూర్ నగర్ లోని ఎమ్మెల్యే స్వగృహం దగ్గర ఉదయం నుండే పాణ్యం నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు,వివిధ గ్రామాల నాయకులు అధికారులు అధిక సంఖ్యలో రావడంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది.ఎమ్మెల్యేకు పూల బోకేలు,పూడదండలు, మొక్కలు,స్వీట్లతో ఎమ్మెల్యేకు మరియు గౌరు వెంకటరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.నియోజకవర్గ, మండల అధికారులు సహకార సొసైటీ చైర్మన్లు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా బి.క్యాంపులోని వృద్ధాశ్రమంలో నాయకులు ఏర్పాటు చేసిన వృద్ధులకు అన్నదాన కార్యక్రమంలో గౌరు జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు.ఓర్వకల్లు మండల కేంద్రంలో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో గౌరు జనార్దన్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి పేద ప్రజలకు క్యారీ బ్యాగ్స్,లంచ్ బాక్స్ లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గోవిందరెడ్డి, బ్రాహ్మణపల్లి నాగిరెడ్డి, గుట్టపాడు సర్పంచ్ మోహన్ రెడ్డి,లక్ష్మీకాంతరెడ్డి, రాంభూపాల్ రెడ్డి,ఏసేపు, సుధాకరయ్య,వెంకటేశ్వర్లు విజయుడు,నాగేశ్వర్ రెడ్డి, పాండు తదితరులు పాల్గొన్నారు.


