NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సర్పంచ్.. కార్యదర్శిని అభినందించిన ఎం.ఎల్.ఎ

1 min read

– ఎంపీటీసీ ఇంజేటి జూనియర్ కు శుభాకాంక్షలు..
పల్లెవెలుగు వెబ్ భీమడోలు : ఉంగుటూరు నియోజకవర్గం సూరప్ప గూడెం. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపికైన నేపథ్యంలో తనను, తన కార్యాలయంలో బుధవారం కలిసిన సర్పంచ్ వెజ్జు బాలాజీ నాయుడును ఉంగుటూరు శాసనసభ్యులు పుప్పాల వాసు బాబు అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతీలుగా ఎంపిక చేయటానికి ప్రామాణికంగా తీసుకున్న 9 అంశాల్లో ఒక అంశంలో సూరప్పగూడెం గ్రామపంచాయతీ రాష్ట్రస్థాయి ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపికయ్యిందని, ఇదే గ్రామపంచాయతీ రానున్న కాలంలో అన్ని అంశాల్లో రాష్ట్రస్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతీ గా ఎంపిక కావాలని ఆకాంక్షించారు. దీనికి అన్నివేళలా తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని హామీ ఇచ్చారు. సూరప్ప గూడెం గ్రామపంచాయతీని మండల పరిధిలోని ఇతర గ్రామపంచాయతీలకు ఆదర్శంగా నిలవాలని . కోరారు. కార్యక్రమంలో భీమవరం మల్లికార్జున రావు ,సూరప్పగూడెం ఎంపీటీసీ సభ్యులు ఇంజేటి జూనియర్, సర్పంచ్ బాలాజీ నాయుడు, పంచాయతీ కార్యదర్శి టి ముత్తయ్య కు , ప్రశంసా పత్రాలు అందజేసి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారి నాగేశ్వరరావు పాల్గొన్నారు.

About Author