NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జడ్పిటిసి.. ఎంపీటీసీ లతో సమావేశమైన ఎమ్మెల్యే

1 min read

–ఉమ్మడి జిల్లాల స్థానిక సంస్థల అభ్యర్థి ఎమ్మెల్సీ డాక్టర్ మధు సుధన్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి..ఎమ్మెల్యే కాటసాని
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె: పట్టణంలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్వగృహం నందు బనగానపల్లె మండల జడ్పిటిసి ఎంపీటీసీలతో బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు.ఈసందర్భంగా బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాల వైఎస్ఆర్ పార్టీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా డాక్టర్ మధుసూదన్ గారిని మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపిక చేయడం జరిగిందని ఈనెల 13 వ తేదీన స్థానిక సంస్థల అభ్యర్థి ఎన్నికల ఓటింగ్ ప్రారంభమవుతుందని ఆరోజు బనగానపల్లె నియోజకవర్గం పరిధిలోగల జడ్పీటీసీలు ఎంపీటీసీలు అందరూ వైఎస్ఆర్ పార్టీ బలపరిచిన అభ్యర్థి డాక్టర్ మధుసూదన్ గారికి క్రమ సంఖ్య ఒకటి లో మొదటి ప్రాధాన్యత ఓటు ఒకటి అనే అంకె వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు గుండం నాగేశ్వర్ రెడ్డి, పార్టీ ప్రచార కార్యదర్శి సిద్ధం రెడ్డి రామ్మోహన్ రెడ్డి, బనగానపల్లి మండల జడ్పిటిసి సుబ్బలక్ష్మమ్మ, ఎంపీపీ మానసవీణ, వైస్ ఎంపీపీ లు మోబీనా షమీం, మంగవరపు లక్ష్మీదేవి, ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

About Author