క్రీడాకారులకు ఎమ్మెల్యే శ్యాం కుమార్ ఆర్థిక సాయం
1 min read
పత్తికొండ, న్యూస్ నేడు: గుంటూరు జిల్లా పిడుగురాళ్ల లో నిర్వహించిన అండర్ 19 క్రికెట్ టెన్నిస్ బాల్ టోర్నమెంట్లో జాతి స్థాయిలో ఎంపికైన పత్తికొండ కు చెందిన ఇలియాస్ భాష ,రసూల్ ,ముఖేష్ లకు స్థానిక ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ ఆర్థిక సాయం అందించారు. ఈ నెల 9 ,10 ,11 తేదీలలో నాగపూర్ లో జరిగే నేషనల్ టోర్నమెంట్ లో ఈ క్రీడాకారులు ఆడబోతున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని అభినందించారు. క్రీడాకారులకు .కే. ఈ.శ్యామ్ కుమార్ ఆర్థిక సహాయం అందించి, చేయూతనిచ్చారు.ఈ మొత్తాన్ని టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు కె. సాంబ శివారెడ్డి స్థానిక టిడిపి ప్రాంతీయ కార్యాలయంలో క్రీడాకారులకు అందజేశారు.