మహానంది లో ఎమ్మెల్యే పూజలు
1 min read

మహనంది , న్యూస్ నేడు: మహానందీశ్వరుని సన్నిధిలో గోపాలపురం నియోజక వర్గం ఎమ్మెల్యే వెంకట రాజు పూజలు నిర్వహించారు. శనివారం స్వామివార్ల దర్శనానికి వచ్చిన ఆయనకు ఆలయ ఇంచార్జి సూపర్డెంట్ సుబ్బారెడ్డి స్వాగతం పలికారు. అనంతరం శ్రీకామేశ్వరీ దేవి సహిత మహానందీశ్వర స్వామివార్ల కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఆనవాయితి ప్రకారం కళ్యాణ మండపంలో వేదపండితులు శాంతారాం బట్టు వేద మంత్రోచ్ఛారణ మధ్య ఏ ఈఓ మధు కండువా కప్పి స్వామివార్ల ప్రసాదాలను అందజేశారు.

