సంచార చికిత్స కార్యక్రమం ఆకస్మికంగా తనిఖీ
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: శనివారం ఈ -తాండ్రపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని నిడ్జూరు గ్రామములోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లో జరుగుచున్న సంచార చికిత్స కార్యక్రమాన్ని జిల్లా నోడల్ అధికారి డాక్టర్. రఘు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం గర్భవంతులను ఉద్దేశించి మాట్లాడుతూ అలసట, ,గుండెదడ,కళ్ళు తిరగడము,తలనొప్పి,తలబరువుగా ఉన్నట్లు అనిపించడము,ఆయాసము,కొంచెం పనికే ఊపిరి అందకపోవడము,నిద్ర పట్టకపోవడము,ఆకలిలేకపోవడము,కాళ్ళు,చేతులు మంటలు,నొప్పులు,నోరు,నాళికలో నొప్పి ,పుండ్లు,నీరసము,బియ్యం,మట్టి తినాలనిపించడము, చర్మం పాలిపోయి ఉండడము,కాళ్ళ వా పులు, గుండె వేగంగా కొట్టుకోవడము,గోళ్ళు పలచగా తయారవ్వడ ము,జుట్టు రాలిపోవడము గర్భవతులలో రక్తహీనత లక్షణాలని తెలిపారు.గర్భిణీలు రక్తహీనత నివారణకు ఆకుకూర, పండ్లు, ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రాలను తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ రేష్మా గారు, ఆరోగ్య కార్యకర్త సరస్వతి, ఆశా కార్యకర్తలు మరియు ప్రాజెక్షనిస్ట్ ఖలీల్ పాల్గొన్నారు.