NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆరోగ్య ఉపద్రవాలను అధిగమించటానికి మోడీ ఫిట్నెస్ మంత్ర

1 min read

యోగ శక్తి సాధనా సమితి

విజయవాడ, న్యూస్​ నేడు : నగరంలోని వి ఆర్ సిద్ధార్థ కాలేజ్ ఆడిటోరియంలో జరిగిన ‘మోడీ ఫిట్నెస్ మంత్ర’ఎక్స్పర్ట్ టాక్ లో పాల్గొన్న యోగ శక్తి సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ మాట్లాడుతు ఎన్ని ఉపద్రవాలు వచ్చినా జనం తట్టుకుని నిలబడే లాగా మోడీ ఫిట్నెస్ మంత్ర ఉందని,దీనిని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి అని కోరతున్నారు. రేపటి ప్రపంచం ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే భారత యోగాతోనే సాధ్యమని తెలిపారు.యోగాంద్రాను ప్రారంభించడానికి విచ్చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ కి స్వాగతం చెబుతూ,మంచి కార్యక్రమాన్ని ఆంధ్రులకు అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సారధి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.ప్రాణ శక్తి గురించి వివరంగా తెలుసుకుని చేతుల నుండి, అరికాళ్ళ నుండి,చెవుల నుండి, ప్రాణాయామం మరియు మెడిటేషన్ నుండి పునః శక్తివంతం కావటం గురించి వందలాదిమంది విద్యార్థులు, కళాశాల ఉద్యోగులకు తర్ఫీదు ఇచ్చినట్లు డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు.కళాశాల యాజమాన్యం అద్భుత సమాచారము ఇచ్చిన యోగ శక్తి సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ ను ఘనంగా సన్మానించారు.

About Author