ఆశా కార్యకర్తల మాసంతపు సమీక్ష సమావేశం
1 min read
కర్నూలు , న్యూస్ నేడు: ఉల్లిందకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి నెల మొదటి మంగళవారం నిర్వహించే ఆశా కార్యకర్తల మాసంతపు సమీక్ష సమావేశం డాక్టర్. శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో సామాజిక ఆరోగ్య అధికారులకు, ఆరోగ్య కార్యకర్తలకు ఆశా కార్యకర్తలకు సమావేశం నిర్వహించినారు, ముఖ్య అతిథిగా జిల్లా సంచార చికిత్స కార్యక్రమ అధికారి డాక్టర్. రఘుగారు పాల్గొన్నారు, అనంతరం మాట్లాడుతూ రక్తహీనత మహిళల్లో అధికంగా ఉంటుంది. స్త్రీ రసజ్వాల అయినప్పటినుండి ప్రతి నెల ఋతుస్రావం వచ్చినప్పుడు రక్తం కోల్పోవలసివుంటుంది.ఈ నేపథ్యంలో వారు రక్తహీనతను తగ్గించే ఆహారం తీసుకోవాలని సూచించారు.కానీ ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యల కారణంగా మహిళలు పోషకాహారానికి దూరంగా వుంటున్నారు. ఈ కారణంగా వారిలో రక్తహీనత యెక్కువగా వుంటుంది.సాధారణ మహిళాతో పాటు గర్భిణికి హిమో గ్లోబిన్ 12కి పైగానే ఉండేటట్లు చూసుకోవాలి.గర్భిణీలు పేదవారైతే అంగన్వాడీలో ఆహారం తీసుకోవాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలల్లో ఇచ్చే ఐరన్ ఫోలిక్ ఆసిడ్ మాత్రలను వైద్యులు సూచించిన మేరకు క్రమం తప్పకుండ వాడాలి. రక్త హీనత లక్షణాలు;-1.మంద కోడిగా ఉండడం 2. త్వరగా నీరసపడి, అలసిపోవడం 3. దేనిమీద శ్రద్ద, ఆసక్తి లేకపోవడం 4. కొద్ది శ్రమకే ఊపిరి అండనట్లు ఉండడం 5. గుండె వేగంగా కొట్టుకోవడం 6. చికాకుగా ఉండడం 7.మానసిక అస్థిరత 8. యెప్పుడు నిద్రపోవడం 9. ఆకలి మందగించడం 10. తలపోటు 11.యే పని చేయ లేక పోవడం 12. కళ్ళు,నోరు,నాలుక పాళీ పోయి ఉండడం 13. గోర్లు పాలిపోవడం తదితర లక్షణాలు ఉంటాయని తెలిపినారు. ఈ కార్యక్రమములో ఎంపీహెచ్ ఇ ఓ విజయకుమార్ గారు, క్షేత్ర స్థాయి పర్యవేక్షకురాలు మద్దమ్మ మరియు ప్రాజెక్షనిస్ట్ ఖలీల్ పాల్గొన్నారు.