NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైభవోపేతంగా అమ్మవార్ల పుట్టినరోజు ఉత్సవాలు…

1 min read

వైభవోపేతంగా శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవి అమ్మవారు రామనపల్లి శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారు పుట్టినరోజు ఉత్సవాలు

భక్తుల కోసం ప్రత్యేక అలంకరణలో కొలువుదీరిన శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవి అమ్మవారు రామన పల్లి చౌడేశ్వరి అమ్మవారు

న్యూస్ నేడు చెన్నూరు:  చెన్నూరు పెన్నా నది తీరంలో పరమట వీధి లో వెలసిన శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవి అమ్మవారి 96వ పుట్టినరోజు ఉత్సవాలను గురువారం ఆలయ కమిటీ నిర్వాహకులు భక్తులు ఘనంగా నిర్వహించారు. ఆషాడ మాసంలో అమావాస్య రోజున చౌడేశ్వరి దేవి అమ్మవారు జన్మించడంతో ప్రతి ఏడాది అమ్మవారి పుట్టినరోజు ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. గురువారం ఉదయం శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు  పూల అలంకరణలునిర్వహించారు. అమ్మవారి గర్భగుడి ప్రక్కన మందిరంలో శ్రీ రామలింగ చౌడేశ్వరి దేవి అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు భావించడమే కాకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే రామనపల్లె శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మహిళలు పెద్ద సంఖ్యలో  బిందెలతో జలాభిషేకం చేశారు. భక్తులకు ఉదయం అల్పాహారం వితరణ ఆలయ కమిటీ వారు నిర్వహించారు. అమ్మవారి పూజలు అనంతరం అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి అమ్మ వారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున మహిళలు భక్తులు క్యూ కట్టారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించడంతోపాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయం ఎదుట చలువ పందిర్లు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం భక్తులకు కమిటీ నిర్వాహకులు అన్నసంతర్పణ నిర్వహించారు. ఆలయంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రాత్రి 10 గంటల వరకు అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులకు అనుమతించారు.

About Author