2014 బాయిలర్ బిల్లు పై పార్లమెంటులో మాట్లాడిన ఎం.పి
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: 1923 బాయిలర్ బిల్లును రద్దు చేస్తూ దాని స్థానంలో 2024 బాయిలర్ బిల్లు ను కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టింది.. ఈ సందర్భంగా బిల్లు పై జరిగిన చర్చలో కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు మాట్లాడారు… 2024 బాయిలర్ బిల్లు ప్రజల యొక్క భద్రత మరియు విలువైన వనరులను బాయిలర్స్ పేలుళ్ల ద్వారా సంభవించే విపత్తులను రక్షించడం కోసం నిర్దేశించబడిందన్నారు.. ఈ బిల్లు ద్వారా సులభతర వ్యాపారాన్ని పెంచే అవకాశం ఉందన్నారు… వీలుగా ఈ బిల్లు బాయిలర్లను ఉపయోగించే వారికి , ఎం.ఎస్.ఎం.ఈ తో సహా అందరికి ప్రయోజనం కలుగుతుందన్నారు…బాయిలర్ల భద్రత, బాయిలర్లను పని చేయించే వారి భద్రత ను దృష్టిలో ఉంచుకొని ప్రాణ , ఆస్తి నష్టం కలిగించే ఏడు నేరాలలో మూడు నేరాలను నేర రహితం చేయడం ద్వారా సూక్ష్మ, చిన్న , మధ్య తరహా సంస్థలను ఎం.ఎస్.ఎం.ఈ నిర్వహణ భారం తగ్గిస్తుందన్నారు… కోర్టులు విధించే జరిమాన స్థానంలో కార్య నిర్వహణ జరిమానాలను ప్రవేశ పెట్టడం ద్వారా నియంత్రణ ప్రక్రియ వేగవంతం గా పెరిగి సమర్థవంతంగా ముందుకు సాగుతుందన్నారు… ఈ బిల్లు ద్వారా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రప్రభుత్వాలు, కేంద్ర బాయిలర్స్ బోర్డుల విధులు, అధికారాలను ఎలాంటి గందరగోళానికి తావులేకుండా పొందుపరిచారన్నారు.. ప్రధాని నరేంద్ర మోదీ దేశ పారిశ్రామిక రంగం భద్రతకు తీసుకొచ్చిన 2024 బాయిలర్ బిల్లుకు తాము సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నట్లు ఎం.పి నాగరాజు తెలిపారు.