కోట జడ్పీ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎంపీడీఓ
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు పట్టణంలోని స్థానిక బైరెడ్డి నగర్ లో ఉన్న జిల్లా పరిషత్ బాలుర (కోట) ఉన్నత పాఠశాలను నందికొట్కూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి శోభారాణి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 3,6 మరియు 9 తరగతులకు గణితం మరియు ఆంగ్లము సబ్జెక్టుల యందు స్టేట్ ఎడ్యుకేషన్ అసెస్మెంట్ సర్వే (యస్.ఈ.ఏ.యస్)టెస్టులు ఈనెల 3 వ తేదీ జరగబోతున్న నేపథ్యంలో టెస్టులకు కేంద్రంగా ఉన్న జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించి ప్రాక్టీసు టెస్టులు జరుగుతున్న విధానాన్ని, మాదిరి పరీక్షల(మాక్ టెస్ట్)జవాబు పత్రాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సలీమ్ భాషా కు 3 వ తేదీ జరగబోయే టెస్టులను ఎటువంటి అవాంతరాలు లేకుండా విజయవంతంగా నిర్వహించాలని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి కార్యాలయ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నాగేంద్రప్రసాద్, పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ శ్రీనాథ్ పెరుమాళ్ళ, గణిత ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, లలితమ్మ, ఆంగ్ల ఉపాధ్యాయులు అరుణా విజయ, భారతి, సరోజిని దేవి తదితరులు పాల్గొన్నారు.