ఎంపీడీవో శివరామయ్య సహాయ సహకారాలు మరువలేనివి : ఎమ్మెల్యే
1 min readపల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంపొదుపు భవనం లో బనగానపల్లె మండల ఎంపిడిఓ శివ రామయ్య ఆధ్వర్యం లో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ,జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్ర బోతు ల పాపిరెడ్డి నీ,ఉత్తమ గ్రామ పంచాయతీ గా ఎన్నికయిన సర్పంచ్ లకు,గ్రామ కార్యదర్శి లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూబనగానపల్లె మండలం లోని ఐదు ఉత్తమ గ్రామపంచాయతీ గా ఎన్నిక కావడానికి మరియు రాష్ట్ర గ్రామపంచాయతీ అవార్డురావడానికి. స్థానిక ఎంపీడీవోశివరామయ్య కృషి ఎనలేనిదని ఈ సందర్భంగా ఆయన కృషిని కొనియాడారు. గ్రామ సచివాలయ సిబ్బందితో విధులు నిర్వహించుకోవడం ఎంపీడీవో శివరామయ్య సహాయ సహకారాలు మరువలేనివని అలాగే స్థానిక సర్పంచులు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించి ఈరోజు రాష్ట్రంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా పేరు నిలబెట్టడం జరిగిందని చెప్పారు. ప్రతి ఒక్కరు కూడా ఉత్తమ అవార్డులు రావడానికి కృషి చేయాలని ఇతర గ్రామపంచాయతీ సర్పంచులకు కార్యదర్శులకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సహాయ సహకారాలతోనే ఈరోజు ఉత్తమ గ్రామ పంచాయతీలుగా తమ నియోజకవర్గంలో రావడం జరిగిందని చెప్పారు. ఆయన సహాయ సహకారాలతోనే బనగానపల్లె పట్టణంలో వంద పడకల ఆసుపత్రిని 24 కోట్ల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని త్వరలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. అలాగే జిఎం టాకీస్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ఉన్న ప్రధాన రహదారిని ఎనిమిది కోట్ల రూపాయలతో రోడ్డు వెడల్పు కార్యక్రమం చేపట్టడం జరిగిందని అందులో భాగంగానే పనులు త్వరితగతిన పూర్తి చేయడం జరుగుతుందని చెప్పారు. బనగానపల్లె పట్టణంలో ఎంత అభివృద్ధి జరుగుతున్న కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అభివృద్ధి జరగడం లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. పట్టణం రోడ్డు వెడల్పు కార్యక్రమంలో పనులు జరిగేటప్పుడు ప్రజలకు కొంత ఇబ్బందికరంగా ఉండొచ్చు అని వాటిని తెలుగుదేశం పార్టీ నాయకులు ఏదో అభివృద్ధి జరిగలేదంటూ సోషల్ మీడియాలో చూపించడం వారి అవివేకానికి నిదర్శనం అని చెప్పారు.జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబాతుల పాపి రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సహాయ సహకారాలతో బనగానపల్లె నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా సమానంగా చూస్తూ ముందుకు తీసుకు వెళ్తున్న నాయకుడు మన కాటసాని రామిరెడ్డి అని చెప్పారు. అలాంటి అలాంటి నాయకునికి మనమందరం అండదండగా ఉండి ఆయనకు సహాయ సహకారాలు అందించవలసిన అవసరం మనందరి మీద ఉందని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని 2024 ఎన్నికల్లో మన బనగానపల్లె నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా కాటసాని రామిరెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గుండం శేషి రెడ్డి, కుర్ని సంఘం రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ మెటికల శ్యామలాదేవి, జిల్లా వైఎస్ఆర్ పార్టీ యువజన సంఘం అధ్యక్షుడు గుండం నాగేశ్వర్ రెడ్డి, బనగానపల్లె మండల జెడ్పీటీసీ సభ్యురాలు సుబ్బ లక్ష్మమ్మ, మండల పరిషత్ అధ్యక్షురాలు మానసవీణ మార్కెట్ యార్డ్ చైర్మన్ దీవెనమ్మ, మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్షుడు సన్నల జనార్దన్ రెడ్డి, బనగానపల్లె పట్టణ మేజర్ గ్రామపంచాయతీ ఈసారి ఎల్లమ్మ, పలుకూరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కోనేటి సుమలత, ఇల్లూరు కొత్తపేట గ్రామ సర్పంచ్ గోగుల రమణ, రామ కృష్ణాపురం గ్రామ సర్పంచ్ లక్ష్మి దేవి, బనగానపల్లె పట్టణ నాలుగవ ఎంపిటిసి సభ్యురాలు ఖాతున్ బి, కో ఆప్షన్ నెంబర్ అనిల్, వైయస్సార్ పార్టీ మైనార్టీ నాయకులు డాక్టర్ మహ్మద్ హుస్సేన్ , అబ్దుల్ ఫైజ్ అత్తర్ జాహిద్ హుస్సేన్, బండి బ్రహ్మానందరెడ్డి కైపా ప్రతాపరెడ్డి, ఎర్రగుడి సుబ్బారెడ్డి, ఆరవ వార్డు మెంబర్ కుమ్మరి సురేష్, బనగానపల్లె పట్టణ ఆర్యవైశ్యులు డాక్టర్ రవికుమార్, గాదంశెట్టి వేణుగోపాల్, మండి మర్చంట్ అసోసియేషన్ చక్రపాణి, గ్రామ సచివాలయ కార్యదర్శులు, వైయస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు వాలంటీర్లు పాల్గొన్నారు.