మలేరియా పై అవగాహన కలిగి ఉండాలి
1 min read
హొళగుంద న్యూస్ నేడు : హొళగుంద పిహెచ్సీ నుంచి ర్యాలీగా వెళ్తున్న ఆశా వర్కర్లు, హెల్త్ సిబ్బంది. హొళగుంది. మలేరియా పై అవగాహన కలిగి ఉండాలని హొళగుంద పిహెచ్సీ డాక్టర్ న్యూటన్ అన్నారు. శుక్రవారం అంతర్జాతీయ మలేరియా దినోత్సవంలో భాగంగా స్థానిక ఆరోగ్య కేంద్రం నుంచి ప్రధాన దారి వరకు డాక్టర్తో పాటు సిహెచ్ చంద్రశేఖర్, హెల్త్ సుపరిటెండెంట్ శ్రీనివాసలు, ల్యాబ్ టెక్నీషీయన్ ప్రసాద్ తదితరులు ఆశా వర్కర్లు, హెల్త్ సిబ్బందితో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ దోమల వల్ల ఈ మలేరియా వ్యాధి వ్యాప్తి చెందుతుందన్నారు. గ్రామాలలో పారిశుద్ధ్యం లోపించకుండా చర్యలు తీసుకుని దోమల బెడదను నివారించు కోవాలని సూచించారు. ప్రజలు తమ ఇళ్ల ముందు చెత్త చెదారం లేకుండా శుభ్రంగా ఉంచుకునెలా వారికి అవగాహన కలిగించాలన్నారు. వ్యాది ప్రథమ స్థాయిలో ఉన్నప్పుడే గుర్తించి తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. చలిజ్వరం రావడం, నిరసించి పోవడం తదితర లక్షణాలు మలేరియా వ్యాధికుంటాయన్నారు.