నల్లగంగమ్మ తల్లి తిరుణాలకు రావాలని ఆహ్వానం
1 min read
– రాయచోటి ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ గిరీష, ఎస్ పి గంగాధర్ రావులుకు ఆహ్వానం…
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో: తిరుణాల నిర్వహణతో సంబేపల్లె శ్రీ దేవరరాయి నల్లగంగమ్మ తల్లి ఆలయ ప్రాశస్త్యం దశ దిశలా వ్యాప్తి చెందాలని వైఎస్ఆర్ సిపి రాయచోటి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ గిరీష, ఎస్ పి గంగాధర్ రావులు అన్నారు.బుధవారం అన్నమయ్య జిల్లా కేంద్రంలోని రాయచోటిలో ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ గిరీష, ఎస్ పి గంగాధర్ రావులను వారి వారి కార్యాలయాలలో ఆలయ ఈఓ కొండారెడ్డి, సర్పంచ్ అంచల రామచంద్రలు కలిశారు.మే నెల 5 న శుక్రవారం నాడు జరగనున్న తిరుణాలలో పాల్గొనాలని ఆహ్వానించారు. తిరుణాల నిర్వహణ ఏర్పాట్లపైన చర్చించారు. దాతలు, భక్తుల సమిష్టి కృషితో తిరుణాలను విజయవంతం చేద్దామని ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ గిరీష, ఎస్ పి గంగాధర్ రావులు పేర్కొన్నారు.