NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స‌న్నబ‌డిపోయిన శ్వాస‌నాళం, విజయవంతంగా చికిత్స

1 min read

ఫినాయిల్ తాగిన యువ‌కుడికి పెద్ద క‌ష్టం

2 సెంటీమీట‌ర్లు ఉండాల్సింది.. 8 మిల్లీమీట‌ర్లే

ద‌గ్గు, క‌ళ్లి వ‌చ్చినా శ్వాస ఆడ‌క తీవ్ర ఇబ్బంది

సంక్లిష్ట శ‌స్త్రచికిత్సతో పున‌రుద్ధరించిన కిమ్స్ వైద్యులు

హైద‌రాబాద్, న్యూస్​ నేడు:  అనుకోకుండా జరిగి ప్రమాదంతో దానికి జరిగిన చికిత్సల కార‌ణంగా శ్వాస‌నాళం స‌న్నబ‌డిపోయి ఊపిరి ఆడ‌క ఇబ్బంది ప‌డుతున్న ఓ యువ‌కుడికి గచ్చిబౌలిలోని కిమ్స్ ఆస్పత్రి వైద్యులు శ్వాస‌నాళాన్ని పున‌రుద్ధరించి కొత్త జీవితం ప్రసాదించారు. ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను ఆస్పత్రికి చెందిన క‌న్సల్టెంట్ మినిమల్ ఇన్వేసివ్, రోబోటిక్ సర్జన్ & ఆంకో-థొరాసిక్ సర్జన్ డాక్టర్ రోహన్ రెడ్డి సి. తెలిపారు.‘‘న‌గ‌రానికి చెందిన ఓ యువ‌కుడు సుమారు రెండేళ్ల క్రితం అనుకోకుండా ఫినాయిల్ తాగాడు. దాంతో అత‌డి శ్వాస‌నాళం బాగా దెబ్బతింది. అత‌డి ఉద‌ర‌భాగం నుంచి ఆ ప‌దార్థాల‌ను తొల‌గించేందుకు ప‌లుమార్లు వ‌రుస‌గా చికిత్సలు చేశారు. అలా క్రమక్రమంగా అత‌డి శ్వాస‌నాళం బాగా స‌న్న‌బ‌డిపోయింది. సాధార‌ణంగా 2 సెంటీమీట‌ర్ల వ‌ర‌కు శ్వాస‌నాళం వ్యాసం ఉండాలి.అత‌డికి అవ‌స‌ర‌మైన ప‌రీక్షలన్నీ చేసిన త‌ర్వాత అత్యంత సంక్లిష్టమైన శ‌స్త్రచికిత్స చేసి శ్వాస‌నాళాన్ని పున‌రుద్ధరించాల్సి ఉంటుంద‌ని నిర్ణయించాం. ఇలాంటి శ‌స్త్రచికిత్సలు చేయాలంటే అత్యంత నైపుణ్యం ఉన్న వైద్యుల‌తో పాటు అందుకు అవ‌స‌ర‌మైన అత్యాధునిక ప‌రికరాలు కూడా అవ‌స‌రం. ఈ చికిత్సలో సీనియర్ కన్సల్టెంట్ థొరాసిక్ సర్జన్ డా. విజయ్, డా. రామ ఫణీంద్ర సహాకారం అందించారు. గ‌చ్చిబౌలి కిమ్స్ ఆస్ప‌త్రిలో ఈ సదుపాయాల‌న్నీ ఉండ‌డంతో అత‌డి ప్రాణాలు నిల‌బెట్టగ‌లిగాం’’ అని వివ‌రించారు.

About Author