రిడ్జ్ పాఠశాలలో జాతీయ వైద్యుల దినోత్సవం
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: స్థానిక లక్ష్మీపురం సమీపంలోని రిడ్జ్ పాఠశాలలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్మరించుకొని అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన చిన్న పిల్లల వైద్య నిపుణులు “జి. భరత్ రెడ్డి మాట్లాడుతూ వ్యాధి సోకిన తర్వాత వైద్యం చేయించుకోవడం కంటే, వ్యాధి రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని సూచించారు. మంచి ఆరోగ్యం కోసం పండ్లు, కూర గాయలు, చిరుధాన్యాలను ప్రతి ఒక్కరు తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని విద్యార్థులకు హితబోధ చేసారు, పాఠశాల సి.ఇ.ఓ గోపినాథ్ మాట్లాడుతూ వైద్యం అంటే ఒక వృత్తిగా కాకుండా మనుషులను బ్రతికించే మహా శక్తిగా భావించి ప్రజలకు సేవ చేస్తున్న వెద్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు . ఆరోగ్యమే మహాభాగ్యమని, అందుకోసం ప్రతి ఒక్కరు మంచి ఆహార అలవాట్లను ఆలవరచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగానే చిన్న పిల్లల వైద్య నిపుణులు పి. జనార్ధన్ రెడ్డి ఆధ్యర్యంలో అధిక మోతాదుగల చక్కెర పదార్థాలను తీసుకోవడం వలన ఎదురయ్యే దుష్ప్రభావాల పై విద్యార్డులకు అవగాహన కల్పించారు. చివరిగా ఆరోగ్య సమస్యల పై విద్యార్థులకు కల్గిన సందేహాలను డా|| జి. భరత్ రెడ్డి నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సి.ఇ.ఓ . సౌమ్య గోపినాథ్ , డీన్ రాజేంద్రన్ , ప్రిన్సిపల్ రాజ్ కమల్ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.