ఉద్యానవనాల అభివృద్ధికి చర్యలు
1 min read

బుధవారపేట పార్కు ప్రారంభోత్సవంలో టీజీ భరత్
కర్నూలు. న్యూస్ నేడు: బుధవారం నగరంలోని ఉద్యానవనాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టికి సారించి అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అధికారులను ఆదేశించారు. బుధవారం 16వ వార్డు బుధవారపేటలోని శ్రీ దామోదరం సంజీవయ్య మైదానంలో నడకబాట, ఓపెన్ జిమ్, కిడ్స్ ప్లే ఎక్యూప్‌మెంట్స్, పచ్చదనం, సుందరీకరణ పనులను మంత్రి టీజీ భరత్, ఎంపీ బస్తిపాటి నాగరాజు, నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బుధవారపేట ప్రాంతంలో జనాభా ఎక్కువ ఉన్నప్పటికీ సేద తీరేందుకు ఒక్క అహ్లాదకరమైన ప్రదేశం లేదని, దీనిని దృష్టిలో ఉంచుకుని చేపల గుంత మైదానంలో రూ.31.4 లక్షలు వెచ్చించి అభివృద్ధి చేశామన్నారు. నగర పరిధిలో అన్ని పార్కుల అభివృద్ధి కృషి చేస్తామని, ప్రాధాన్యత క్రమంలో ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. నగర పరిధిలో పచ్చదనం పెంపునకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామని, ఈ వర్షాకాలంలో 4,800 మొక్కలు కార్పొరేషన్ ద్వారా నాటించినట్లు మంత్రి పేర్కొన్నారు.కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ యస్.శివమ్మ, డిప్యూటీ కమిషనర్ సతీష్ రెడ్డి, ఇంచార్జ్ ఎస్ఈ శేషసాయి, ప్రజారోగ్య అధికారి డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి, డిఈఈ మనోహర్ రెడ్డి, ట్రైనీ ఏఈ రాంమోహన్, తదితరులు పాల్గొన్నారు.


