NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: జాతీయ బాలికా దినోత్సవ వేడుకలు ” జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ వారి ఆదేశాల మేరకు శనివారం కర్నూలు బి క్యాంపు నందు గల గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల నందు జాతీయ బాలిక దినోత్సవాన్ని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి  ఘనంగా నిర్వహించారు. జడ్జి మాట్లాడుతూ ప్రతి బాలికకు నాణ్యమైన విద్యతో పాటు సామాజిక భద్రతను అందించాల్సిన బాధ్యత మన అందరిదీ అని, బాలికలపై వివక్ష, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థలను నిర్ములించాల్సిన  అవసరం మన అందరి పైన ఉందన్నారు. బాల్య వివాహాలు జరుగుతుంటే ఆ సమాచారాన్ని చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098కు గాని లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ నెంబర్ 15100 కు కానీ కాల్ చేస్తే వారు వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చి వివాహాన్ని నిలుపు దల చేస్తారని తెలిపారు.జిల్లా మెడికల్ అండ్ హెల్త్ నోడల్ ఆఫీసర్ రఘు  మాట్లాడుతూ హాస్పిటల్స్ నందు లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు భ్రూణ హత్యలు మరియు లింగ నిర్ధారణ  పరీక్షలు చట్ట ప్రకారం నేరమని తెలిపారు . మహిళా యస్ ఐ విజయలక్ష్మి మాట్లాడుతూ మహిళలు పిల్లల రక్షణకై అనేక చట్టాలు కలవని తెలిపారు.ప్రభుత్వం బాలికల సంక్షేమానికి బేటి బచావో బేటి పడావో లాంటి ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నదని బాలికల ఆరోగ్య పరిరక్షణ మన అందరి బాధ్యత అన్నారు.  డిసిపిఓ శారద బాల్యవివాహల నివారణపై  ప్రతిజ్ఞ చేయించారు.   ఈ కార్యక్రమంలో డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్  ఆఫీస్ నోడల్ ఆఫీసర్ రఘు మరియు పి.సి & పి.యన్. డి. టి. ప్రోగ్రాం ఆఫీసర్ సుమలత,జిల్లా గిరిజన సంక్షేమ శాఖ సూపరింటెండెంట్ ముని చంద్ర, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ రమణయ్య,డిసిపిఓ శారద,లీగల్ ఎయిడ్ మెంబర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాసులు పాఠశాల ఉపాధ్యాయులు  పాల్గొన్నారు.

About Author