‘నేషనల్ సైన్స్ డే’లో … ‘రవీంద్ర’ కు ప్రథమ బహుమతి
1 min read
కర్నూలు, న్యూస్నేడు:జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం కర్నూల్ లోని IIITDM యూనివర్సిటీలో నిర్వహించిన నేషనల్ సైన్స్ డే 2025 పోటీలలో రవీంద్ర బాలికల పాఠశాల (RPS) విద్యార్థినులు డ్యూయల్ పర్పస్ వీల్ చైర్ మరియు స్ట్రెచర్ బెడ్ ఫర్ హాస్పిటల్ అంశమునకు ప్రథమ బహుమతి పొందారు. ఈ సందర్భంగా బహుమతి పొందిన విజేతలు 8వ తరగతి విద్యార్థినులు యస్. అఫీఫా ఫిర్దోస్,జి. యస్. లిఖిత, పి. సమీరాభాను లను, అందుకు సూచనలు అందించిన ఏటీఎల్ మాస్టర్ రమేష్ రంజిత్ కు రవీంద్ర విద్యా సంస్థల వ్యవస్థాపకులు జి. పుల్లయ్య గారు ,చైర్మన్ జివిఎం మోహన్ కుమార్ గారు, అకాడమిక్ అడ్వైజర్ డాక్టర్ మమతా మోహన్ గారు, వైస్ చైర్మన్ జి. వంశీధర్ గార్లు శుభాకాంక్షలు తెలియజేశారు.