PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మాట‌లు రావ‌డం లేదు.. నువ్వు బంగారానివి !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆర్ఆర్ఆర్ సినిమా పై రాంగోపాల్ వ‌ర్మ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. రాజ‌మౌళిని ఆకాశానికి ఎత్తేశారు. రాజ‌మౌళి ప్రేక్ష‌కుల‌కు దొరికిన బంగారం అంటూ ఆర్జీవీ పొగిడారు. సినిమా గురించి మాట్లాడ‌టానికి మాట‌లు రావ‌డంలేద‌ని ఆర్జీవి అన్నారు. ‘‘మామూలుగా నేను ఏ విషయం మాట్లాడినా చాలా స్పష్టతతో మాట్లాడతా. కానీ మొదటిసారి నాకు మాటలు కరువయ్యాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌కు ఒకటే చెప్పాలనుకుంటున్నా. ఫేమ్‌, స్టాటస్‌ ఇవన్నీ మరచిపోయి సినిమా చూశా. ప్రతి సన్నివేశాన్ని మనస్ఫూర్తిగా ఎంజాయ్‌ చేశా. రాజమౌళి ట్రైలర్‌ విడుదల చేసినప్పుడు సినిమా బావుంటుందని భావించా. సినిమా చూశాక ఇదొక అద్భుతం అని అర్థమైంది. ఇప్పుడు ఏం చెప్పాలో తెలియడం లేదు. జీవితంలో మొదటిసారి నాకు మాటలు దొరకడం లేదు. కథేంటి? క్యారెక్టర్లు ఎవరు చేశారు అనేదాని కన్నా దర్శకుడు కథ చెప్పిన విధానం, స్ర్కీన్‌పై చూపించిన తీరు నన్నెంతగానో ఆకట్టుకుంది. చరణ్‌ పాత్ర బావుంది.. తారక్‌ పాత్ర ఇంకా బావుంది అనేవి అనవసరమైన మాటలు. పాత్రలకు తగ్గట్లు ఎవరికి వాళ్లే ప్రతి సీన్‌లోనూ అదరగొట్టారు. 30 ఏళ్లలో ఇంతగా ఏ చిత్రాన్ని ఎంజాయ్‌ చేయలేదు. రాజమౌళి.. నువ్వు ప్రేక్షకులకు దొరికిన బంగారం. సినిమానే కలగా చేసుకుని మంచి చిత్రాలు తీస్తున్నావు. దానికి సినీ ప్రేమికులు ఎంతగానో ఆనందిస్తున్నారు’’ అని వర్మ వాయిస్‌ లెటర్‌లో పేర్కొన్నారు.

                                    

About Author