NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పండుగల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం

1 min read

50 డివిజన్ల లో ఉదయం 6 గంటల నుండే పంపిణీ ప్రారంభం

రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ సమయాన్నికూలంగా సంక్షేమ పథకాలు

ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి

ఏలూరు, న్యూస్​ నేడు:  రాష్ట్రం ఎన్ని ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఎటువంటి ఆటంకాలు లేకుండా సమయానుకూలంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తోన్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఆగష్టు నెలకు సంబంధించిన ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో కొనసాగింది. అన్ని డివిజన్‌లలో ఉదయం 7గంటల సమయానికే పంపిణీ ప్రక్రియను ప్రారంభించారు. ఇదేక్రమంలో స్థానిక 40వ డివిజన్‌లో చేపట్టిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. డివిజన్‌లోని అర్హుల ఇళ్ళకు వెళ్ళి వారికి పెన్షన్‌ సొమ్ములు అందించీ, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా వృద్ధప్య పెన్షన్‌ తీసుకుంటూ మృతిచెందిన భర్తల స్థానంలో భార్యలకు మంజూరైన స్పౌజ్‌ పెన్షన్లను పంపిణీ చేశారు. దాంతోపాటూ ఇతర సంక్షేమ పథకాలు అందుతున్నదీ లేనిదీ ఆరాతీశారు. అలాగే స్థానిక సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ 2014 నుండి 19 వరకూ టిడిపి ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలన్నీ నిరాటంకంగా కొనసాగాయన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం 2024 వరకూ స్పౌజ్‌ పెన్షన్ల మంజూరును నిలిపివేసీ, అర్హులకు అన్యాయం చేసిందని మండిపడ్డారు. తదనంతరం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 2లక్షలకు పైగా స్పౌజ్‌ పెన్షన్లను మంజూరు చేస్తే,ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో దానిద్వారా 404 మంది అర్హులకు ఆర్ధిక లబ్ది కలిగిందన్నారు. ప్రజలెవ్వరూ వైసిపి నాయకుల కల్లబొల్లి మాటలు నమ్మవద్దని హితవు పలికిన ఎమ్మెల్యే చంటి,,, కూటమి ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని ప్రజలకు భరోసా కల్పించారు. ఏపిఎస్‌ ఆర్టీసి విజయవాడ జోన్‌ – 2 ఛైర్మన్‌ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ హయాంలో సంక్షేమాల అమలు నిర్విరామంగా కొనసాగుతోందన్నారు. కార్యక్రమంలో 40వ డివిజన్ ఇంచార్జి బోరా ప్రసాద్, డివిజన్ కో-ఇంచార్జ్ బొంతు చిన్న, డివిజన్ ప్రెసిడెంట్ రెడ్డి కుమార్, క్లస్టర్ ఇంచార్జ్ బౌరోతు బాలాజీ, ఈడా ఛైర్మన్‌ పెద్దిబోయిన శివప్రసాద్‌, ఎఎంసి ఛైర్మన్‌ మామిళ్ళపల్లి పార్థసారధి, ఏలూరు కార్పొరేషన్‌ కమిషనర్‌ ఎ. భానుప్రతాప్‌, ఏలూరు నగర టిడిపి అధ్యక్షులు చోడే వెంకటరత్నం,కో-ఆప్షన్‌ సభ్యులు ఎస్సెమ్మార్‌ పెదబాబు,తెలుగుదేశం పార్టీ నాయకులు గుండాల దుర్గారావు,ఆకుల రంగారావు, శేషపు వెంకటేశ్వరరావు, చిపడ ఆనంద్, మక్కా శివ, సబ్బవరపు జానకిరామ్,చల్లా పెదబాబు మరియు వివిధ హోదాలలో ఉన్న కుటమి నాయకులు పాల్గొన్నారు.

About Author