ఎన్టీఆర్ వైద్య సేవలు పునఃప్రారంభం
1 min read
ఆశాతో టీంతో ప్రభుత్వ చర్చలు సఫలం
- బకాయిలు రూ.500 కోట్ల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం
అమరావతి:ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవలు ( ఆరోగ్య శ్రీ సేవలు)కు సంబంధించి బకాయిలు ఉండటంతో నెట్ వర్క్ హాస్పిటల్స్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఆరోగ్య శ్రీ సేవలు బంద్ చేస్తూ.. ఆశా టీం సభ్యులు సమ్మె ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశా టీంతో సోమవారం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. బకాయిలు రూ.500 కోట్లు తక్షణ విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. దీంతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, నెట్‌వర్క్ హాస్పిటల్స్ సమ్మె విరమించాయి. మంగళవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు ఏ ఆటంకం లేకుండా కొనసాగుతాయని పేద ప్రజలకు శుభవార్త చెప్పారు.
ముఖ్య గమనిక:
డా. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ నుంచి హాస్పిటల్ ఎంపానెల్, నెట్వర్క్ హాస్పిటల్ బిల్లులు చేయిస్తామని, జరిమానాలు విధించకుండా, తనిఖీలు లేకుండా చూస్తామని కొంతమంది ఆగంతుకులు అధికారుల పేర్లు చెప్పుకొని హాస్పిటల్స్ వారిని సంప్రదిస్తున్నారు. దీనిపై డా. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ వారు పోలీసులకి ఫిర్యాదు చేశాం. హాస్పిటల్ యజమాన్యము ఇలాంటి ఫేక్ కాల్స్ వస్తే ఈ క్రింది హెల్ప్ లైన్ నెంబర్ కు సమాచారం ఇవ్వవలసినదిగా డా. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ముఖ్య కార్య నిర్వహణాధికారి కోరారు.
హెల్ప్ లైన్ నెంబర్: 9281074745