NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

2న కర్నూల్ లో భారీ వాల్మీకుల సభ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: శుక్రవారం వాల్మీకి సంఘం పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షులు సుభాష్ చంద్రబోస్ గారు రేపు నెల రెండో తారీఖున చలో కర్నూల్ చలో వాల్మీకి అంటూ పోరాటపటిమ పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో వాల్మీకులకు ఇచ్చిన మాట ప్రకారం మా ప్రభుత్వం వచ్చిన వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కి కృతజ్ఞతగా రేపు ఆదివారం రెండో తారీఖున కర్నూల్ లో భారీ వాల్మీకుల సభ ఏర్పాటుచేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞత సభ ద్వారా వాల్మీకులు మీ వెంటే ఉంటామని బహిరంగ ప్రతిజ్ఞ చేస్తూ వాల్మీకుల సత్తా చాటనున్నారు రెండో తారీకు కర్నూల్ సభకు భారీ ఎత్తున వాల్మీకుల సోదరులు అందరు కూడా పార్టీలకతీతంగా వాల్మీకు లు కు ఎవరైతే మేలు చేశారో వారికి కృతజ్ఞత తెలిపే సమయం ఆసన్నమైంది కావున వాల్మీకి సోదరులారా అందరు కూడా రేపు ఆదివారం రెండో తారీఖున కర్నూల్ కి తరలి రావలసిందిగా కోరుతున్నాం అని సుభాష్ చంద్రబోస్ గారు అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షులు బి దేవా వాల్మీకిల పోరాట కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ భీం నాయుడు రాష్ట్ర నాయకులు వెంకన్న సుధాకర్ మున్సిపల్ చైర్ పర్సన్ బోయ శాంతా సింహం నాగేంద్ర లక్ష్మీనారాయణ మాజీ జెడ్పిటిసి లక్ష్మయ్య లోకేష్ రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు.

About Author