బీసీ లపై జరుగుతున్న కుట్రలను పసిగట్టాలి
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: బీసీ లు చైతన్య వంతులు కాకుంటే తరతరాలుగా జరుగుతున్న కుట్రలను పసిగట్టలేమని బానిసత్వాన్ని పోగొట్టుకోలేమని బి. పీ మండల్ జయంతి వారోత్సవాల సందర్బంగా కర్నూలు జిల్లా BAMCEF ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ లపై జరుగుతున్న కుట్రలు – వాటిని ఎదుర్కోవడం ఎలా అనే అంశం పై BAMCEF నాయకుడు డాక్టర్.కంచర్ల కంచర్ల హరిప్రసాద్ హెచ్చరించారు. బీసీ లు ఐక్యతతో జరుగుతున్న కుట్రలను పటపంచాలు చేయాలని బిఎంపీ జిల్లా కన్వీనర్ దాసరి రామశేషయ్య అన్నారు. బీసీ లు మతం మత్తులోంచి బయటకు వచ్చి పోరాడాలని జాతీయ బీసీ సంఘం నాయకులు నక్కలమిట్ట శ్రీనివాసులు అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు శేషఫణి,సలీం, పెరికల రంగస్వామి, నాగరాజు,రమేష్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.


