NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చంద్రబాబు సంచలన నిర్ణయం.. సీఎం అయిన తరువాతే..!

1 min read


పల్లెవెలుగు వెబ్: ప్రతిపక్ష నేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ సీఎం అయిన తరువాతే సభకు వస్తానని శపథం చేశారు. వ్యవసాయంపై చర్చ సందర్భంగా సభలో అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు.
దీంతో సభ యుద్ధవాతావరణాన్ని తలపించింది. సభలో జరిగిన వాదనలపై చంద్రబాబు తీవ్ర మనస్తాపం చెందారు. సమావేశాలను వాకౌట్ చేస్తూ బయటకు వెళ్లిపోయారు. తన కుటుంబాన్ని బజారుకిడ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్యపై అసభ్యంగా ప్రవర్తించారన్న బాబు కన్నీటి పర్యంతమయ్యారు. మళ్లీ గెలిచి సీఎం అయిన తర్వాతే అసెంబ్లీకి వస్తానని శపథం చేశారు.

About Author