ప్రజలకు నాణ్యమైన భోజనాన్ని తక్కువ ధరకు అందించడం మా లక్ష్యం
1 min read
ప్యాపిలి, న్యూస్ నేడు: డోన్ పట్టణంలోని అన్న క్యాంటీన్‌ను డోన్ శాసనసభ్యులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు. క్యాంటీన్‌లో అందించబడుతున్న భోజన నాణ్యతను స్వయంగా పరిశీలించి, అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని ప్రశ్నించారు. ప్రజలకు సక్రమంగా మరియు శుభ్రతతో కూడిన ఆహారం అందుతుందా లేదా అన్నది తెలుసుకున్నారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “ప్రభుత్వం ప్రారంభించిన అన్న క్యాంటీన్లు సామాన్య ప్రజల పట్ల ఉన్న బాధ్యతను ప్రతిబింబిస్తాయి. ఇటువంటి సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు నాణ్యమైన భోజనాన్ని తక్కువ ధరకు అందించడం మా లక్ష్యం. ఎవరైనా లోపాలు ఉన్నా సహించబోము, అని ఎమ్మెల్యే కోట్ల తెలిపారు.ఈకార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు,అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
